ప్రియుడితో కలిసి సుపారీ హత్యకు ప్లాన్ – ఐదుగురు అరెస్ట్

ప్రియుడితో కలిసి సుపారీ హత్యకు ప్లాన్ – ఐదుగురు అరెస్ట్

అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం తిమ్మాపురంలో ఒక మహిళ, తన ప్రియుడితో కలిసి విలేకరిని హత్య చేయాలని సుపారీ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. నూకేశ్వరి అనే మహిళ, పైడిరాజుతో కలిసి తుని ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులతో లక్ష రూపాయలకు హత్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇక విచిత్రం ఏంటంటే — రౌడీలు పొరపాటున విలేకరి ఇంటి పక్కనున్న నాగేశ్వరరావు అనే వ్యక్తిపై దాడి చేయడంతో కుట్ర బయటపడింది. బాధితుడి ఆరోగ్యం విషమంగా ఉండగా, పోలీసులు నిందితులందరినీ పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ మోహనరావు ఈ వివరాలు వెల్లడించారు.