Air India Plane Crash: విమానంలో 11A సీటుకు పెరుగుతున్న డిమాండ్‌.. ఈ సీటు అంత సురక్షితమా? ప్రత్యేకత ఏంటి?

Air India Plane Crash: విమానంలో 11A సీటుకు పెరుగుతున్న డిమాండ్‌.. ఈ సీటు అంత సురక్షితమా? ప్రత్యేకత ఏంటి?

Air India Plane Crash: విమానాల సీట్ల కాన్ఫిగరేషన్‌లు చాలా వరకు మారుతూ ఉంటాయి. మనుగడ తరచుగా సంక్లిష్టమైన అంశాల పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ సీటు అన్నింటికి సురక్షితం కాకపోవచ్చని విమానయాన నిపుణులు అంటున్నారు. ఎందుకంటే విమానాలను..Air India Plane Seat: జూన్ 12, 2025న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI-171 విషాదకరమైన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే విమానంలో 242 మంది ఉండగా, ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఇప్పుడు అతను బతకడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను కూర్చున్న సీటు నంబర్‌ 11A. అక్కడే ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, 40 ఏళ్ల విశ్వష్‌కుమార్ రమేష్ కూర్చున్నాడు. అప్పటి నుండి, ఆ సీటు కోసం అభ్యర్థనలు పెరిగాయని భారతీయ ట్రావెల్ ఏజెంట్లు నివేదించారు. కొంతమంది ప్రయాణికులు దాని కోసం అదనపు డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఆ తర్వాత UKకి చెందిన ప్రయాణికుడు రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతని పక్కన కూర్చున్న అతని సోదరుడు మృతి చెందాడు. అత్యవసర నిష్క్రమణ వరుసలో కూర్చున్న రమేష్ అద్భుతంగా తప్పించుకోవడం అందరిని ఆశ్యర్యపరుస్తోంది.

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు – మిడ్, స్మాల్ క్యాప్స్ ర్యాలీ కొనసాగించాయి | kranthinews

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు – మిడ్, స్మాల్ క్యాప్స్ ర్యాలీ కొనసాగించాయి | kranthinews

నిఫ్టీ 25,500 దిగువకు లాగడంతో ఈక్విటీ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. మెటల్, ఆటో, రియాల్టీ, FMCG రంగాల్లో అమ్మకాలు కనిపించగా, PSU బ్యాంకులు, ఐటీ, మీడియా రంగాల్లో కొనుగోళ్లు మార్కెట్లను నిలబెట్టాయి. చివరికి, సెన్సెక్స్ 452 పాయింట్లు క్షీణించి 83,606 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు తగ్గి 25,517 వద్ద ముగిశాయి. అయితే BSE మిడ్‌క్యాప్ 0.6%, స్మాల్‌క్యాప్ 0.8% పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ సెషన్‌లో 57,614 పాయింట్లను తాకినా, ముగిసే సమయానికి 0.2% నష్టంతో 57,312 వద్ద స్థిరపడింది. ప్రధానంగా నష్టాలు చవిచూసిన స్టాక్‌లు: టాటా కన్స్యూమర్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హీరో మోటో, మారుతి. లాభపడినవి: ట్రెంట్, SBI, ఇండస్‌ఇండ్ బ్యాంక్, BEL, జియో ఫైనాన్షియల్. రంగాల ప్రకారం PSU బ్యాంక్ ఇండెక్స్ 2.6%, ఫార్మా ఇండెక్స్ 0.5% పెరిగాయి. ఇతర రంగాలు నష్టాల్లో ముగిశాయి. స్టాక్ విశేషాలు: సిగాచి ఇండస్ట్రీస్ షేరు 11% క్షీణం (రియాక్టర్ పేలుడు) అలెంబిక్ ఫార్మా 5% లాభం (USFDA అనుమతి) JB కెమికల్స్ 6% నష్టం (టోరెంట్ ఫార్మా డీల్) వారీ ఎనర్జీస్ 7% లాభం (US సోలార్ ఆర్డర్) కర్ణాటక బ్యాంక్ 5% నష్టం (CEO రాజీనామా) 52 వారాల గరిష్ట స్థాయిని తాకిన షేర్లు: దీపక్ ఫెర్టిలైజర్స్, సిటీ యూనియన్ బ్యాంక్, లారస్ ల్యాబ్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఎస్‌ఆర్‌ఎఫ్, హ్యుందాయ్ మోటార్, మాక్స్ ఫైనాన్షియల్, తదితరాలు. గ్లోబల్ మార్కెట్లు: యుఎస్ ఫెడరల్ వడ్డీరేటు కోత అంచనాలతో అమెరికా మార్కెట్లు ర్యాలీ చేశారు. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండగా, యూరోపియన్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

జులై 1 నుండి రైలు టికెట్ ధరలు పెంపు | KranthiNews

జులై 1 నుండి రైలు టికెట్ ధరలు పెంపు | KranthiNews

భారతీయ రైల్వే టికెట్ ఛార్జీలను జులై 1 అర్ధరాత్రి నుండి పెంచుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు ఇది వర్తించనుంది. ఏసీ క్లాస్‌లకు కిలోమీటరుకు 2 పైసలు, స్లీపర్, నాన్-ఏసీ ఫస్ట్ క్లాస్‌కు కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెంపు ఉంది. జనరల్ క్లాస్‌లో 500 కిమీ వరకు మార్పు ఉండదు. ప్రీమియం రైళ్లలో కూడా టికెట్ ధరలు పెరిగాయి. అయితే జూన్ 30 లోపు బుక్ చేసిన టికెట్లపై కొత్త ధరలు వర్తించవని రైల్వే స్పష్టం చేసింది. స్థానిక, సీజనల్ టికెట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు.

కెప్టెన్ కూల్ ట్యాగ్‌కి ట్రేడ్మార్క్ కోసం ధోనీ దరఖాస్తు | kranthinews

కెప్టెన్ కూల్ ట్యాగ్‌కి ట్రేడ్మార్క్ కోసం ధోనీ దరఖాస్తు | kranthinews

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ “కెప్టెన్ కూల్” అనే పేరును ట్రేడ్మార్క్ చేసుకునేందుకు దరఖాస్తు చేశాడు. జూన్ 5న దాఖలైన ఈ దరఖాస్తును ట్రేడ్మార్క్ పోర్టల్ జూన్ 1న ప్రచురించింది. ఈ ట్యాగ్‌ను స్పోర్ట్స్ కోచింగ్, ఫెసిలిటీస్, ట్రైనింగ్ రంగాల్లో ఉపయోగించేందుకు ధోనీ ప్రయత్నిస్తున్నాడు. ఇదే ట్యాగ్‌కు మరో కంపెనీ కూడా దరఖాస్తు చేసినప్పటికీ అది రిజిస్ట్రేషన్ దశలోనే ఉంది. కాగా, ధోనీకి ఇటీవల 2025 ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది.

స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న నష్టాలు: ఈరోజు టాప్-5 షేర్లు ఇవే | kranthinews

స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న నష్టాలు: ఈరోజు టాప్-5 షేర్లు ఇవే | kranthinews

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల పరంపరను కొనసాగించాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు, మదుపర్ల అమ్మకాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో స్వల్ప లాభాల్లో ఉన్న సూచీలు మధ్యాహ్నం తర్వాత నష్టాల బాట పట్టాయి.రోజు ముగింపుని చూస్తే సెన్సెక్స్ 287 పాయింట్లు కోల్పోయి 83,409 వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో 24,453 వద్ద నిలిచింది. మళ్లీ నిఫ్టీ 24,500 దిగువకు పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 460 పాయింట్లు నష్టపోయింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 82 పాయింట్లకు పైగా దిగజారింది. లాభాల్లో ఉన్న టాప్ షేర్లు: టాటా కమ్యూనికేషన్స్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ మ్యాన్‌కైండ్ ఫార్మా టాటా స్టీల్ నష్టాల్లో ప్రధాన షేర్లు: ఆర్బీఎల్ బ్యాంక్ ఎన్‌సీసీ ఫియోనిక్స్ మిల్స్ ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చితే 85.70 వద్ద కొనసాగుతోంది.

కోల్‌కతా న్యాయ విద్యార్థినిపై దారుణం దేశవ్యాప్తంగా ఆందోళన

కోల్‌కతా న్యాయ విద్యార్థినిపై దారుణం దేశవ్యాప్తంగా ఆందోళన

కోల్‌కతాలో ఒక న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇది కళాశాల ఆవరణలోనే జరగడం గమనార్హం. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా, ముందుగానే ఆమెను లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డట్టు తెలిసింది. బాధితురాలు స్పృహ తప్పిన సమయంలో కూడా మానవత్వాన్ని దులిపేసే రీతిలో వ్యవహరించినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి.

క్యాబ్ ప్రయాణికులకు కేంద్రం కొత్త నిబంధనలు

క్యాబ్ ప్రయాణికులకు కేంద్రం కొత్త నిబంధనలు

క్యాబ్ సేవలపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇకపై క్యాబ్ ధరలు పెరగొచ్చని స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో, ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయంలో ఛార్జీలు తక్కువగా ఉంటాయి. 3 కిలోమీటర్ల లోపు దూరానికి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఇకపై డ్రైవర్ లేదా ప్రయాణికుడు రైడ్‌ను రద్దు చేస్తే జరిమానా తప్పదు. డ్రైవర్లకు ఆరోగ్య బీమా అందించే ప్రణాళికను కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది.

బెంగళూరులో ఆటో ఛార్జీలకు షాక్ – 20% వరకు పెంపు

బెంగళూరులో ఆటో ఛార్జీలకు షాక్ – 20% వరకు పెంపు

బెంగళూరులో ప్రయాణికులకు మరో భారంగా ఆటో ఛార్జీలు పెరగనున్నాయి. కొత్త నిర్ణయం ప్రకారం, ప్రథమ 1.9 కిలోమీటర్లకు రూ.36, తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.18 వసూలు చేయనున్నారు. ఈ పెంపు దాదాపు 20 శాతం వరకు ఉండబోతోంది. నాలుగేళ్ల విరామం తర్వాత ఛార్జీలు సవరించబడ్డాయి. రవాణా శాఖ మంత్రి ఆమోదించిన ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం రావాల్సి ఉంది. ఆటో యూనియన్లు ఇంకా ఎక్కువ పెంపును కోరినప్పటికీ, ప్రభుత్వం మధ్యమార్గం అనుసరించినట్టు సమాచారం.

ఆకస్మిక మరణాలకు కొవిడ్ టీకాల వల్ల కాదన్న కేంద్రం

ఆకస్మిక మరణాలకు కొవిడ్ టీకాల వల్ల కాదన్న కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా అనంతరం ఆకస్మిక మరణాలు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, వాటికి కొవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఐసీఎంఆర్‌, ఎయిమ్స్‌, ఎన్‌సీడీసీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయాన్ని తేల్చారు. 18-45 ఏళ్ల మధ్య వయసు గలవారిలో 2021 అక్టోబర్‌ నుంచి 2023 మార్చి మధ్య జరిగిన అనూహ్య మరణాలపై 19 రాష్ట్రాల్లో అధ్యయనం జరిగింది. ఈ మరణాలకు టీకాలు కారణమయ్యాయని నిరూపించే ఆధారాలేమీ లేవని స్పష్టం చేశారు. జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, మునుపటి అనారోగ్యాలే ప్రధాన కారణాలుగా గుర్తించారు. అలాగని టీకాలపై తప్పుడు ప్రచారాలు చేయడం ప్రమాదకరమని, అవి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశముందని కేంద్రం హెచ్చరించింది. టీకాల వల్ల కోవిడ్ సమయంలో లక్షలాది ప్రాణాలు రక్షించబడ్డాయని గుర్తుచేశారు.

ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్‌కు మరో షాక్ – వియన్నాలో నిలిపివేత

ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్‌కు మరో షాక్ – వియన్నాలో నిలిపివేత

ఎయిర్ ఇండియా డ్రిమ్‌లైనర్‌ విమానంలో మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ నుంచి వాషింగ్టన్‌కి జులై 2న బయల్దేరిన AI103 విమానం వియన్నాలో స్టాప్‌ఓవర్‌ సందర్భంగా తనిఖీల్లో లోపం బయటపడింది. దీంతో ముందు జాగ్రత్తగా విమానాన్ని అక్కడే నిలిపివేశారు. ప్రయాణికులకు హోటల్ వసతులు కల్పించగా, తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కారణంగా వాషింగ్టన్‌ నుంచి ఢిల్లీకి రానున్న AI104 ఫ్లైట్‌ కూడా రద్దయ్యింది. టికెట్ బుక్ చేసిన వారికి మొత్తం రీఫండ్ అందిస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇదే తరహాలో గత నెల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమానాల భద్రతపై ప్రశ్నలు ఊతమిస్తున్నాయి.

భర్త హత్యకు మామతో సహాయపడ్డ భార్య...  పెళ్లైన 45 రోజుల్లోనే విషాదాంతం

భర్త హత్యకు మామతో సహాయపడ్డ భార్య... పెళ్లైన 45 రోజుల్లోనే విషాదాంతం

బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో కలచివేసే ఘటన వెలుగు చూసింది. పెళ్లైన 45 రోజుల్లోనే ఓ మహిళ భర్తను హత్య చేయించేసింది. మామపై ప్రేమ పెంచుకున్న ఆమె, భర్తను అడ్డంకిగా భావించి సుపారీ గ్యాంగ్‌ను రెడీ చేసింది. పోలీసుల సమాచారం ప్రకారం — 20 ఏళ్ల గుంజాదేవికి, 25 ఏళ్ల ప్రియాంశుతో వివాహం జరిగింది. కానీ పెళ్లికి ముందు నుంచే ఆమె మామ జీవన్ సింగ్ (55)తో సంబంధం ఉంది. కుటుంబ సభ్యులు దీనిని వ్యతిరేకించడంతో ఆమెను బలవంతంగా ప్రియాంశుతో పెళ్లి చేశారు. జూన్ 25న ప్రియాంశు రైలు ప్రయాణం చేస్తూ ఇంటికి వస్తుండగా నవీనగర్ స్టేషన్ వద్ద దుండగులు అతడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. దర్యాప్తులో గుంజాదేవి, జీవన్ సింగ్ మధ్య తరచూ కాల్స్, సుపారీ గ్యాంగ్‌తో కాంటాక్టులు ఉన్నట్లు వెల్లడి అయింది. ప్రస్తుతం గుంజాదేవి, ఇద్దరు గ్యాంగ్ సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. జీవన్ సింగ్ పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు కొనసాగుతోంది.

కొండచరియల ధాటికి కేదార్‌నాథ్  యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

కొండచరియల ధాటికి కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

ఉత్తరాఖండ్‌లోని మున్‌కతియా వద్ద కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రాళ్లతో రహదారి పూర్తిగా మూసుకుపోవడంతో యాత్రకు ఆటంకం ఏర్పడింది. కొందరు యాత్రికులు చిక్కుకోగా, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వారికి రక్షణ కల్పించి సోన్‌ప్రయాగ్‌కి తరలించారు. భద్రతా దృష్ట్యా అధికారులు యాత్రను నిలిపివేసినట్లు తెలిపారు.

259 లో 1-12 చూపిస్తోంది