శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా

గత కొంత కాలంగా భక్తుల నుంచి ప్రైవేట్ వాహనదారులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని.. ఈ దోపిడీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ చర్యల వలన రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రైవేట్ రవాణా నిర్వాహకులు అధిక ఛార్జీలను అరికట్టవచ్చునని భావిస్తున్నామని చెప్పారు. తిరుపతి -తిరుమల మధ్య తిరిగే బస్సులతో పాటు.. తిరుమలలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు వెళ్లాలనుకునే భక్తులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు.. ఈ సేవలను ఉచితంగా అందించడానికి ఆర్టీసీ అధికారులు ఓకే చెప్పారని తెలిపారు. ఈ సేవల్లో భాగంగా మొదటి దశలో దాదాపు 150 బస్సులు అందుబాటులోకి వస్తాయి అన్నారు. టిటిడి ఇప్పటికే ఉచిత సేవలను అందించే పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులను చేర్చడం వల్ల ప్రైవేట్ టాక్సీలపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.

School Holidays: విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. 3 రోజులు పాఠశాలలకు సెలవులు

School Holidays: విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. 3 రోజులు పాఠశాలలకు సెలవులు

School Holidays: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వేసవి సెలవులు ముగిసి ఈనెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు విద్యార్థులకు ఏకంగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులకు పండగే.. పండగ. మరి ఈ సెలవులు ఎందుకు వస్తున్నాయి? అన్ని పాఠశాలలకు వర్తిస్తాయా? లేదా అనేది తెలుసుకుందాం.. పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. గత వారం కిందటనే ప్రారంభమైన పాఠశాలలు ఇప్పుడు మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్నంలో స్వయంగా పాల్గొని ఆసనాలు వేయనున్నారు. యోగా ఏర్పాట్లలో భాగంగా విశాఖలోని అన్ని పాఠశాలలకు 20వ తేదీన సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అటు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా సెలవులను రానున్నాయి. అలాగే తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో శుక్రవారం అంతర్జాతీయ యోగాదినోత్సవ ఏర్పాట్లలో భాగంగా కొన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి.

pawankalyan | పాశమైలారం ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన – మృతులకు సానుభూతి వ్యక్తం

pawankalyan | పాశమైలారం ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన – మృతులకు సానుభూతి వ్యక్తం

అమ‌రావ‌తి,క్రాంతిన్యూస్ తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదం దేశాన్ని దిగ్రహింపజేసింది. ఈ దురంతంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియజేస్తూ, వారికి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పాశమైలారం ప్రాంతంలోని ఒక రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటన నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ యంత్రాంగం బాధిత కుటుంబాలకు వెంటనే సహాయం అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీ లిక్కర్ కుంభకోణం: ఇండోర్‌లో కీలక నిందితులు ఎస్‌ఐటీ చేతుల్లోకి | kranthinews

ఏపీ లిక్కర్ కుంభకోణం: ఇండోర్‌లో కీలక నిందితులు ఎస్‌ఐటీ చేతుల్లోకి | kranthinews

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎస్‌ఐటీ కీలక మలుపు తిప్పింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పీఏలు బాలాజీ, నవీన్‌లను ఇండోర్‌లో అదుపులోకి తీసుకుంది. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దులకు రూ.8.2 కోట్లు తరలించిన కేసులో వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఆ సొమ్మును అప్పట్లో ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. అరెస్ట్ భయంతో వీరు ఇండోర్‌కు పారిపోయినప్పటికీ అక్కడి నుంచే వైసీపీ నేతలతో ఫోన్లు మాట్లాడుతూ ఉండటంతో, వారి ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఎస్‌ఐటీ బృందాలు వారిని పట్టుకున్నారు. గతంలో బాలాజీ అదుపులో ఉన్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు కోర్టులో హెబియస్ కార్పస్ వేసినా, ఎస్‌ఐటీ అప్పట్లో అది ఖండించింది. చివరికి ఎస్‌ఐటీ వీరిద్దరిని పట్టుకోవడంలో విజయం సాధించింది.

137 రోజుల తర్వాత విడుదలైన వల్లభనేని వంశీ – భార్య భావోద్వేగం

137 రోజుల తర్వాత విడుదలైన వల్లభనేని వంశీ – భార్య భావోద్వేగం

విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత వల్లభనేని వంశీ మోహన్ చివరకు జైలు నుంచి విడుదలయ్యారు. ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో అరెస్ట్‌యిన వంశీ, 137 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ కేసులతో సహా మొత్తం 11 కేసుల్లో ఊరట లభించడంతో విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. వంశీ విడుదల వార్త తెలిసిన వెంటనే భార్యతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు జైలుపైకి చేరుకున్నారు. జైలు గేటు వద్ద వంశీని చూసి ఆయన భార్య భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం నూజివీడు కోర్టుకు బయలుదేరారు. ఇక నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో చివరకు వంశీ జైలుకు వీడ్కోలు చెప్పారు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ రద్దుపై ఆసక్తి చూపకపోవడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.

ఐపీఎస్‌కు రాజీనామా చేసిన సిద్ధార్థ్ కౌశల్ | kranthinews

ఐపీఎస్‌కు రాజీనామా చేసిన సిద్ధార్థ్ కౌశల్ | kranthinews

ఏపీ డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా పనిచేస్తున్న సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, తాను ఒత్తిళ్ల వల్ల కాదు, మంచి అవకాశాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఐఐఎం విద్యార్థిగా ఉండటంతో, భవిష్యత్తులో మరింత విశిష్టంగా సేవలందించాలనే లక్ష్యంతో రాజీనామా చేశానన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఏపీ తనకు సొంత రాష్ట్రంగా భావిస్తున్నానని, ప్రభుత్వానికి, సీనియర్లకు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఆయన కృష్ణా, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో ఎస్పీగా సేవలందించారు.

కర్నూలు – విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసుల ప్రారంభం

కర్నూలు – విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసుల ప్రారంభం

కర్నూలు-విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ సేవలను పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు ఈ మార్గంలో విమానాలను నడపనుంది. భవిష్యత్తులో ప్రతిరోజూ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలులో మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రయాణికులకు స్వాగతం పలికారు. ఇతర ప్రాంతాలకు కూడా విమాన సౌకర్యాలు విస్తరించనున్నట్లు సమాచారం.

2026 మేడారం జాతర తేదీలు ఖరారు

2026 మేడారం జాతర తేదీలు ఖరారు

తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర 2026కి సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు బుధవారం ప్రారంభమయ్యే ఈ జాతర జనవరి 28 నుంచి 31 వరకూ జరుగనుంది. జనవరి 28న సారలమ్మ రాక, 29న సమ్మక్క గద్దెపై ఆరాధన, 30న భక్తుల మొక్కుల సమర్పణ, 31న వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని పూజారులు కోరుతున్నారు.

తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకుంటున్నారా?: సీఎం చంద్రబాబు విమర్శ

తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకుంటున్నారా?: సీఎం చంద్రబాబు విమర్శ

కుప్పంలో మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, తప్పుడు ప్రచారాలు తాత్కాలికమని, కానీ అభివృద్ధి పనులు శాశ్వతమని అన్నారు. ‘‘కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్లలా పక్కన పడేసి వెళ్తారా? ఇది మానవత్వమా?’’ అంటూ విమర్శలు గుప్పించారు. సింగయ్య భార్యను బెదిరించి రాజకీయ ప్రయోజనాలకు వాడాలనుకుంటున్నారా? అంటూ తేల్చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడుతూ — గోదావరిలో ఏటా వృథాగా సముద్రంలోకి పోతున్న 200 టీఎంసీలను వినియోగిస్తే తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. ఏ ప్రాజెక్టును కూడా వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. రైతులకు మద్దతుగా — హంద్రీనీవాకు రూ.3,950 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మైక్రో ఇరిగేషన్‌కు 90% సబ్సిడీ, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడిపై వ్యాఖ్యలు – గత ప్రభుత్వం ఒక్క బిడ్డకే ఇచ్చిన అమ్మఒడిని, తాము తల్లిని గౌరవిస్తూ అన్ని పిల్లలకు వర్తించేలా ఇస్తున్నామని తెలిపారు. చంద్రబాబు మాటల్లో — అభివృద్ధి ప్రయోజనాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టమవుతోంది.

నాయుడుపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

నాయుడుపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

తిరుపతి జిల్లా నాయుడుపేట SKLS పెట్రోల్ బంక్ ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. విన్నమాల క్రాస్ రోడ్ వద్ద చేపట్టిన తనిఖీలో, AP 16 TY 6865 నంబర్‌ గల లారీలో 403 బస్తాలు — సుమారు 20 టన్నుల పిడిఎస్ బియ్యం ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ గజేంద్రను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడుపేట సీఐ బాబి తెలిపారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – కొత్త రేషన్‌ కార్డులు సెప్టెంబరు నుంచి

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – కొత్త రేషన్‌ కార్డులు సెప్టెంబరు నుంచి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారికి కొత్తగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులను మంజూరు చేయనుంది. ఇప్పటివరకు 2 లక్షల మందికి కొత్త కార్డులు మంజూరు కాగా, తిరస్కరించిన దరఖాస్తులు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ కార్డులు అధునాతనంగా, క్యూ ఆర్ కోడ్‌తో, బ్యాంకు ఏటీఎం కార్డు తరహాలో ఉండనున్నాయి. రాజకీయ రంగులు, నాయకుల చిత్రాలు లేకుండా రూపుదిద్దిన ఈ కార్డులు సెప్టెంబరు నెల నుంచి సరుకుల పంపిణీలో ఉపయోగించనున్నారు. ఈ-పోస్‌ యంత్రాల ద్వారా స్కాన్‌ చేసి లబ్ధిదారుల వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉండగా, కొత్తగా మంజూరు చేసే రెండు లక్షల కార్డుల పంపిణీ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.

శ్రీవారికి రూ.100 కోట్లు విరాళం ఇచ్చిన వేగేశ్న ఆనందరాజు కన్నుమూత

శ్రీవారికి రూ.100 కోట్లు విరాళం ఇచ్చిన వేగేశ్న ఆనందరాజు కన్నుమూత

ప్రముఖ దాత, రాజు వేగేశ్న ఫౌండేషన్ డైరెక్టర్ వేగేశ్న ఆనందరాజు (67) ఆదివారం విశాఖపట్నంలో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబంలో భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆనందరాజు తన ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా అనేక ఆలయాల్లో భక్తుల కోసం సదుపాయాలు కల్పించారు. తిరుమలలో రూ.77 కోట్లతో అన్నదాన భవనం, రూ.27 కోట్లతో వాటర్ ప్లాంట్ నిర్మించారు. అలాగే షిర్డీ, ద్వారకాతిరుమల, యాదాద్రి సహా పలు ప్రాంతాల్లో ఆసుపత్రులు, నీటి ప్లాంట్లు, ప్రయాణికుల సదుపాయాలు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, విద్యార్థులకు విద్యా సహాయం అందించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలకు ఈ సేవాభావి మరణం తీరని లోటుగా పేర్కొంటున్నారు.

66 లో 1-12 చూపిస్తోంది