
బాపట్ల
బాపట్లలో పాఠశాలలో అగ్నిప్రమాదం – కంప్యూటర్లు, పుస్తకాలు కాలిబూడిద
సూర్యలంక రోడ్డులోని ఓ పాఠశాల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో పాఠశాలలోని కంప్యూటర్లు, ఎల్‌ఈడీ మానిటర్లు, పాఠ్యపుస్తకాలు సహా పలు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. శనివారం సెలవు రోజు కావడంతో విద్యార్థులు హాజరుకాలేదు. పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.