యానాం మార్కెట్లో పులసల రూపంలో 'విలసలు' విక్రయం!

యానాం మార్కెట్లో పులసల రూపంలో 'విలసలు' విక్రయం!

గోదావరిలో పులసల జాడ లేకపోయినా యానాం మార్కెట్లో పులసలని చెప్పుకుని విక్రయిస్తున్నారు. కోల్‌కతా, హౌరా నుంచి తెచ్చే 'విలస' చేపలను స్థానికంగా పులసలుగా ప్రజలకు విక్రయిస్తూ కొంతమంది వ్యాపారులు లాభాలు పొందుతున్నారు. రంగు, వాసన ఒకేలా ఉన్నా తాజాదనంలో, రుచిలో తేడా స్పష్టంగా ఉంటుంది. గోదావరిలో పుట్టిన పులస రుచి బహుళం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. నిజమైన పులస కోసం మత్స్యకారులు ఎదురుచూస్తుండగా, మార్కెట్లో మాత్రం 'విలస'లు హల్‌చల్ చేస్తున్నాయి.