మంత్రి కొండ సురేఖ ఇంటి వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

మంత్రి కొండ సురేఖ ఇంటి వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

హనుమకొండ రాంనగరలో మంత్రి కొండ సురేఖ ఇంటి వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించవద్దని డిమాండ్ చేస్తూ ముట్టడి చేశారు. ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొని, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సుబేదారి స్టేషన్‌కు తరలించారు. కార్మికులు, ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పటికీ పథకాన్ని బదిలీ చేయడం నిరాశ కలిగించిందని ఆరోపించారు. జీతాలు లేకపోయినా విద్యార్థులకు భోజనం అందించామని, ఇప్పుడు జీవనాధారం కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.