
జయశంకర్ భూపాలపల్లి
మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం పంపిణీ | KRTV | KRANTHINEWS
ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో పంట నష్టం పాలైన రైతులకు నష్టపరిహార చెక్కులు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, మనది రైతు ప్రభుత్వం కావడంతో రైతుల పక్షాన నిలిచామని, కలెక్టర్ దివాకర్ నేతృత్వంలో చర్యలు తీసుకుని 950 మందికి నష్టపరిహారం చెల్లించామని చెప్పారు. త్వరలో రైతు చట్టం తీసుకురాబోతున్నామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మవద్దని, విత్తనాలు కొనుగోలు చేసే ముందు అధికారుల సలహా తీసుకోవాలని హెచ్చరించారు. టీఆర్ఎస్ అడ్డంకులు పెడుతున్నా, ములుగు అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.