
కరీంనగర్
వేములవాడలో యువకుడి ఆత్మహత్య | KRANTHINEWS
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ముదిరాజ్ వీధికి చెందిన 23ఏళ్ల దీటి రోహిత్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో భగవంతుడిని ప్రశ్నిస్తూ – “నీ కొడుకు అయితే వానికి ఇలాగే తలరాత రాస్తావా?” అని ఆవేదన వ్యక్తం చేశాడు. “నా కలలు కూలిపోయాయి… జీవించడానికంటే చనిపోవడమే తక్కువ నొప్పిగా ఉంది” అంటూ తన బాధను వెలిబుచ్చాడు.తుది కోరికగా – “నా మృతదేహాన్ని వారణాసి ఘాట్‌లలో దహనం చేయండి” అని రాశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.