
పల్నాడు
పెన్నులు మింగిన భార్య... డాక్టర్లకి షాక్!
పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఓ 28 ఏళ్ల మహిళ భర్తతో జరిగిన గొడవపై కోపంతో తీవ్రమైన చర్యకు పాల్పడింది. విపరీతమైన కడుపునొప్పి, వాంతులతో బాధపడుతూ ఆమెను వినుకొండ రోడ్డులోని మాతాశ్రీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. సిటీ స్కాన్, ఎండోస్కోపీ పరీక్షల్లో కడుపులో నాలుగు పెన్నులు ఉన్నట్లు తెలిసింది. అత్యాధునిక లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసి పెన్నులు తొలగించారు. ఆ తర్వాత ఆమె భర్తపై కోపంతోనే ఈ క్రేజీ చర్యకు పాల్పడినట్లు వెల్లడించింది. ఘటనపై వైద్యులు, సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.