
సంగారెడ్డి జిల్లాలో ప్రేమజంట విషాదాంతం | KRANTHINEWS
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ బాలాజీనగర్‌లో ఓ ప్రేమజంటపై దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతి స్పాట్‌లోనే మృతి చెందగా, యువకుడిని తీవ్రంగా గాయాలతో ఆస్పత్రికి తరలించారు. మరణించిన యువతిని రమ్యగా గుర్తించగా, ఆమె డిగ్రీ చదువుతోందని తెలుస్తోంది. ప్రవీణ్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆమె, ఇటీవల వారి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు సమాచారం. ఘటన రోజు ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉండగా, రమ్య అప్పటికే మృతిచెందింది. ప్రవీణ్ అపస్మారక స్థితిలో ఉండటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రేమజంటపై బయటపడాల్సిన అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇది పరస్పర ఆత్మహత్యయత్నమా, లేక రమ్యపై దాడి చేసి ప్రవీణ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న రామచంద్రపురం పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. రమ్య మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది.