R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
4000 టన్నుల బొగ్గు మాయం... వర్షాల వల్లే అని మంత్రి వివరణ!
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
4000 టన్నుల బొగ్గు మాయం... వర్షాల వల్లే అని మంత్రి వివరణ!

మేఘాలయలో సుమారు 4000 టన్నుల బొగ్గు అదృశ్యమైందని వార్త కలకలం రేపింది. రాజాజూ, డెంగన్‌గాన్ గ్రామాల్లో ఉన్న నిల్వల నుంచి బొగ్గు కనిపించకుండా పోయిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, బొగ్గు ఎక్కడికి పోయిందో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో మంత్రి కిర్మెన్ షిల్లా మాట్లాడుతూ, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా బొగ్గు కొట్టుకుపోయి ఉండవచ్చని అన్నారు. అయితే ఇది సహజంగా జరిగిందా లేక అక్రమంగా జరిగిందా అన్నది తేల్చడం కష్టమని స్పష్టం చేశారు. కాగా, మేఘాలయలో 2014 నుంచి కోర్టు ఆదేశాల మేరకు బొగ్గు మైనింగ్ నిషేధించబడింది. అయినా అక్రమ మైనింగ్ జరుగుతోందన్న ఆరోపణలు కొనసాగుతున్నాయి.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi