L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

8 బంతుల్లో 7 సిక్సర్లు.. పోలార్డ్ మళ్లీ సత్తా చాటాడు

8 బంతుల్లో 7 సిక్సర్లు.. పోలార్డ్ మళ్లీ సత్తా చాటాడు

8 బంతుల్లో 7 సిక్సర్లు.. పోలార్డ్ మళ్లీ సత్తా చాటాడు

కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో వెస్టిండీస్ స్టార్ కీరన్ పోలార్డ్ తన పవర్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ట్రింబాగో నైట్ రైడర్స్ తరఫున ఆడిన అతను 29 బంతుల్లో 65 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 2 ఫోర్లు వచ్చాయి. ప్రత్యేకంగా వరుసగా 8 బంతుల్లో 7 సిక్సర్లు బాదిన పోలార్డ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. నవియన్ బిడైసీ, వకార్ సలామ్‌ఖేల్ బౌలింగ్‌లో అతను వరుసగా సిక్సర్లు బాదాడు. పూరన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 90 రన్స్ జోడించాడు. ఈ ఇన్నింగ్స్‌తో పోలార్డ్ టీ20ల్లో 14 వేల రన్స్ మార్క్ చేరుకున్న రెండో విండీస్ బ్యాటర్‌గా నిలిచాడు. క్రిస్ గేల్ తర్వాత ఈ రికార్డు సాధించాడు. 167 రన్స్‌కే ఆగిన పాట్రియాట్స్‌పై నైట్ రైడర్స్ 12 రన్స్ తేడాతో విజయం సాధించగా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పోలార్డ్‌ అయ్యాడు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi