L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ప్రేమ కోసం లింగమార్పిడి చేసిన రాధకు చేదు అనుభవం

ప్రేమ కోసం లింగమార్పిడి చేసిన రాధకు చేదు అనుభవం

ప్రేమ కోసం లింగమార్పిడి చేసిన రాధకు చేదు అనుభవం

మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ కోసం ఓ యువకుడు లింగ మార్పిడి చేసి యువతిగా మారిన సంఘటన వెలుగులోకి వచ్చింది. షాజాపూర్ జిల్లా యువకులు రాధాకృష్ణ, రమేష్ పదేళ్లుగా స్వలింగ సంబంధంలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలన్న రాధాకృష్ణ కోరికకు రమేష్ "అమ్మాయిగా మారితేనే పెళ్లి" అన్నాడు. దీంతో ముంబైలో లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని రాధగా మారాడు. అయితే ఆమెగా మారిన తర్వాత రమేష్ పెళ్లికి నిరాకరించాడు. అంతటితో ఆగకుండా రాధను వేధిస్తూ, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రేమ పేరిట ఒకరి జీవితాన్ని నాశనం చేసిన ఘటనగా దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv kranthi