Lahari
రచయిత
ఆగస్టు 8న కరీంనగర్‌లో బీసీల భారీ బహిరంగ సభ
Lahari
రచయిత
ఆగస్టు 8న కరీంనగర్‌లో బీసీల భారీ బహిరంగ సభ

కరీంనగర్‌లో ఆగస్టు 8న బీసీల భారీ బహిరంగ సభ జరగనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో బీసీ నాయకులతో సమావేశం నిర్వహించిన తలసాని, కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎప్పటి నుంచో మోసం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ తరపున త్వరలో బీసీ ప్రతినిధులు రాష్ట్రపతిని కలవనున్నారని తెలిపారు. 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించరాదని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కులగణనను పారదర్శకంగా నిర్వహించలేదని, బిల్లు పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్స్ తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా బీసీలతో మభ్య పెడుతున్నారని ఆరోపించారు. 42% రిజర్వేషన్ అమలు చేయకుంటే బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని తలసాని స్పష్టం చేశారు.