sairam
రచయిత
రెండు ఊళ్ల మధ్య చిచ్చుపెట్టిన లవ్ మ్యారేజి..
sairam
రచయిత
రెండు ఊళ్ల మధ్య చిచ్చుపెట్టిన లవ్ మ్యారేజి..

లవ్ మ్యారేజి రెండూ ఊళ్ల మధ్య చిచ్చు పెట్టింది. జంటకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులపై మరో గ్రామానికి చెందిన వారు దాడి చేయడంతో.. పంచాయతీ కాస్తా పోలీస్ స్టేషన్ కు చేరింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం చటకాయ గ్రామానికి చెందిన ఘంటసాల రోజాకుమార్, నత్తగుళ్లపాడుకు చెందిన లక్ష్మీప్రసన్న కొన్నేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకుని, రక్షణ కోసం శుక్రవారం సాయంత్రం బుచ్చిరెడ్డిపాలెం పోలీసుల్ని ఆశ్రయించారు. పెద్దల సమక్షంలో ప్రేమ జంటను కైకలూరు తీసుకువస్తుండగా ఏలూరు మండలం శ్రీపర్రు సమీపంలో చటకాయ గ్రాస్తులపై నత్తగుళ్లపాడు వాసులు సినీఫక్కీలో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వారిని కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికత్స చేస్తున్నరు. బాధిత వ్యక్తుల ఫిర్యాదు మేరకు కైకలూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.