L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ప్రేమను తిరస్కరించిందనే కోపంతో యువతిని హత్య చేసిన యువకుడు

ప్రేమను తిరస్కరించిందనే కోపంతో యువతిని హత్య చేసిన యువకుడు

ప్రేమను తిరస్కరించిందనే కోపంతో యువతిని హత్య చేసిన యువకుడు

కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లో ప్రేమ విఫలమవడాన్ని తట్టుకోలేక ఓ యువకుడు అమానుషంగా ప్రవర్తించిన సంఘటన కలకలం రేపుతోంది. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి, ఆమె స్పృహలో లేకపోయిన సమయంలో మెడలో తాళి కట్టి సెల్ఫీలు తీసుకున్నాడు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, యువతి గాయాలు తీవ్రంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. నిందితుడు అభిషేక్ అనే యువకుడిగా గుర్తించగా, ఇతను పాండవపుర ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. యువతిని పలు రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్న ఇతనిని ఆమె తిరస్కరించడంతో కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన మైసూర్ ప్రజలను తీవ్రంగా కలచివేసింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newscrime news