Lahari
రచయిత
ఆధార్ ఎప్పుడూ ప్రాథమిక గుర్తింపు కాదు: UIDAI సీఈఓ
Lahari
రచయిత
ఆధార్ ఎప్పుడూ ప్రాథమిక గుర్తింపు కాదు: UIDAI సీఈఓ

బిహార్‌లో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ఆధార్‌ను గుర్తింపు పత్రంగా అంగీకరించకపోవడంపై రాజకీయ గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో UIDAI సీఈఓ భువనేష్ కుమార్ స్పందించారు. ఆధార్ ఎప్పుడూ ‘తొలి గుర్తింపు పత్రం’గా పరిగణించబడలేదని స్పష్టంచేశారు. ఇక ఓటరు జాబితా స్పెషల్ సవరణ కోసం ఎన్నికల సంఘం 11 గుర్తింపు పత్రాల జాబితా విడుదల చేసింది. ఇందులో ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భద్రతా పరంగా ఆధార్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉందని, నకిలీ కార్డుల నిర్ధారణకు ఉపయోగపడుతుందని భువనేష్ తెలిపారు. మరియు త్వరలో ఆధార్ డిజిటల్ యాప్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. దీని ద్వారా ఫిజికల్ ఆధార్ పంచుకోవాల్సిన అవసరం లేకుండా మారనుంది. ప్రజలు అవసరానికి తగినట్లుగా పూర్తి లేదా మాస్క్ ఆధార్‌ను షేర్ చేసుకోవచ్చన్నారు.