ashok
రచయిత
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై AAIB నివేదిక కీలక విషయాలు
ashok
రచయిత
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై AAIB నివేదిక కీలక విషయాలు

ఒక్క 32 సెకన్లే గాలిలో ప్రయాణించి కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం విషయంలో ఏఏఐబీ 15 పేజీల రిపోర్టు విడుదల చేసింది. టేకాఫ్ తర్వాత క్షణాల్లోనే ఇంజిన్లు ఆగిపోయాయి. ఫ్యూయల్ కట్ఆఫ్ స్విచ్‌లు అనూహ్యంగా ఆఫ్ అయ్యాయి. పైలెట్‌ల మధ్య సంభాషణలో, ఎవ్వరూ స్విచ్ ఆఫ్ చేయలేదని తెలిపారు. పవర్ సప్లై ఆగడంతో ఆటోమేటిక్ ‘రామ్ ఎయిర్ టర్బైన్’ పని చేసింది. ఇంజిన్లను రీ-స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినా రెండో ఇంజిన్ విఫలమైంది. విమానం రన్‌వే నుంచి కేవలం 0.9 NM దూరంలో కూలింది. టేకాఫ్ సమయంలో ఫ్లాప్స్, రియర్ సెట్టింగ్స్ సాధారణంగానే ఉన్నాయని వెల్లడించారు. పక్షి ఢీకొట్టడం, వాతావరణ సమస్యలు లేవు. పైలెట్లు అనుభవజ్ఞులు, ఫిట్‌గా ఉన్నారని తేలింది. దాడి జరిగిన ఆధారాలు లేవు. ఫ్యూయల్ స్విచ్‌లో లోపాలుంటేనా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఎయిర్ ఇండియా పక్కా ఇన్‌స్పెక్షన్ చేయలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నివేదిక ద్వారా ప్రమాదానికి మానవ తప్పిదం కాక, సాంకేతిక లోపమే కారణమని అర్థమవుతోంది.