Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పెద్దల పంచాయితీ రక్తపాతం.. ఇద్దరు యువకుల దారుణ హత్య

పెద్దల పంచాయితీ రక్తపాతం.. ఇద్దరు యువకుల దారుణ హత్య

పెద్దల పంచాయితీ రక్తపాతం.. ఇద్దరు యువకుల దారుణ హత్య

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లిలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ దంపతుల వివాదాన్ని ఓర్పుగా పరిష్కరించాల్సిన పెద్దల పంచాయితీ, చివరికి రక్తపాతం దాకా దారితీసింది. పెద్దల మధ్య జరిగిన చర్చలో ఒక్కసారిగా ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తత చెలరేగింది. మాటా మాటా పెరిగి, చివరికి రెండు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో మల్లేశ్‌, గణేష్‌ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. యువకుల వర్గం చెబుతున్న వివరాల ప్రకారం, అమ్మాయి వర్గం సుపారీ గుంపును పిలిపించి ముందస్తు దాడికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం దాడిలో పాల్గొన్నవారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanacrime news