L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కాసిపేటలో మళ్లీ పెద్దపులి సంచారం: రైతులలో భయాందోళన

కాసిపేటలో మళ్లీ పెద్దపులి సంచారం: రైతులలో భయాందోళన

కాసిపేటలో మళ్లీ పెద్దపులి సంచారం: రైతులలో భయాందోళన

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో మళ్లీ పెద్దపులి తిరుగుతుంది. ఇటీవల వెంకటాపూర్ గ్రామ శివారులోని ఓ రైతు లేగ దూడపై పులి దాడిచేసి చంపింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పులి ఆనవాళ్లు పరిశీలించారు. మల్కెపల్లి, వెంకటాపూర్ బీట్లు పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తిర్యాణి, కాసిపేట శివారు గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో చిరుతపులుల సంచారం కూడా ఆందోళన కలిగిస్తోంది. దేవాపూర్ రేంజ్ పరిధిలోని మద్దిమాడ, గట్రాంపల్లి గ్రామాల్లో చిరుతలు పశువులపై దాడులు చేశాయి. అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పంట పొలాలకు గుంపులుగా వెళ్లాలని, అడవిలో పశువులను మేపవద్దని రైతులకు సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv kranthi