yakub
రచయిత
అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలు
yakub
రచయిత
అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలు

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం ఢిల్లీ, ముంబై సహా 40కిపైగా చోట్ల సోదాలు నిర్వహించింది. 2017-19 మధ్య యస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాన్ని దారి మళ్లించారని అనుమానంతో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన సీనియర్ అధికారుల విచారణ కొనసాగుతోంది. మొత్తం 50 సంస్థలు, 25 మందిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇప్పటికే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థను ఫ్రాడ్ కంపెనీగా గుర్తించింది. సుమారు రూ.31,580 కోట్ల రుణాలను తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా వినియోగించారని ఎస్బీఐ ఆరోపించింది. రుణ నిధుల వినియోగంలో స్పష్టమైన అవకతవకలు చోటు చేసుకున్నట్లు బ్యాంకు తమ అంతర్గత నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వివిధ నిబంధనల ప్రకారం అధికారిక ఫిర్యాదులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.