ritesh
రచయిత
‘మోతెవరి లవ్ స్టోరీ’ విజయం పట్ల ఆనందంగా ఉన్న హీరో అనిల్ గీలా
ritesh
రచయిత
‘మోతెవరి లవ్ స్టోరీ’ విజయం పట్ల ఆనందంగా ఉన్న హీరో అనిల్ గీలా

ZEE5 తెలుగు వేదికగా ఆగస్టు 8న విడుదలైన వెబ్‌సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ అద్భుతమైన స్పందనతో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. గ్రామీణ తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్‌కి అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రలు పోషించగా, శివ కృష్ణ బుర్రా దర్శకత్వం వహించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మించారు.ఈ సిరీస్ విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాదులో బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో అనిల్ గీలా మాట్లాడుతూ: "మా కష్టానికి మంచి ఫలితం దక్కింది. మోతెవరి లవ్ స్టోరీ మన కుటుంబంలో జరిగే కథలానే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ప్రేక్షకుల ఆదరణకి థాంక్స్. మా సిరీస్‌ను మూడుగురికి చెప్పండి. ఇంకా ఎక్కువ మంది చూడాలి," అని అన్నారు. ZEE5 తెలుగు కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ సాయి తేజ్ వ్యాఖ్యలు: "అనిల్ యూట్యూబ్ నుంచి ఓటీటీకి వచ్చాడు. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌కి వెళ్లే సమయం వచ్చింది. ఈ సిరీస్‌లో పని చేసిన ప్రతీ ఒక్కరూ అద్భుతంగా చేశారు. పైరసీని నివారించండి. సబ్‌స్క్రైబ్ చేసుకుని చూసే అలవాటు పెంచుకోండి," అని చెప్పారు. నిర్మాత శ్రీరామ్ శ్రీకాంత్ తెలిపారు: .