R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మహావతార్ నరసింహ'కు మరో ఘనత – యానిమేటెడ్ సినిమాల్లో సరికొత్త రికార్డు

మహావతార్ నరసింహ'కు మరో ఘనత – యానిమేటెడ్ సినిమాల్లో సరికొత్త రికార్డు

మహావతార్ నరసింహ'కు మరో ఘనత – యానిమేటెడ్ సినిమాల్లో సరికొత్త రికార్డు

తాజాగా విడుదలైన యానిమేటెడ్‌ చిత్రం ‘మహావతార్‌ నరసింహ’ విజయపథంలో దూసుకెళుతోంది. విడుదలైన మొదటినుంచి పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను నమోదు చేస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా 8 రోజుల్లో రూ.60.5 కోట్ల గ్రాస్‌ను సాధించి, భారత యానిమేటెడ్‌ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా గుర్తింపు పొందింది. అమెరికాలో కూడా ఈ చిత్రం మంచి ఆదరణ పొందుతోంది. వన్ మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిందని అక్కడి పంపిణీదారులు ప్రకటించారు. ఇది డివైన్ బ్లాక్‌బస్టర్‌గా కొనియాడుతున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించగా, దర్శకత్వం అశ్విన్‌కుమార్ చేపట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో లైవ్ యాక్షన్ వెర్షన్ చేస్తే రాముడిగా ఎవరిని చూపించాలనుకుంటారని ప్రశ్నించగా, ఆయన రామ్‌చరణ్‌ను ఎంపిక చేస్తానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్‌లు

CinemaLatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi