L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

టీసీఎస్ ఉద్యోగులకు మరో షాక్ – లేఆఫ్స్, ఇంక్రిమెంట్లకు బ్రేక్!

టీసీఎస్ ఉద్యోగులకు మరో షాక్ – లేఆఫ్స్, ఇంక్రిమెంట్లకు బ్రేక్!

టీసీఎస్ ఉద్యోగులకు మరో షాక్ – లేఆఫ్స్, ఇంక్రిమెంట్లకు బ్రేక్!

భారత్‌లో అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్‌ భారీగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు వెల్లడించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందికి, అంటే సుమారు 12,200 మందికి వచ్చే ఏడాది వరకు ఉద్వాసన పలకనుంది. ముఖ్యంగా మధ్య స్థాయి, సీనియర్ ఉద్యోగులపై వేటు పడనుంది. సంస్థ తాజాగా వేతన పెంపులు, ఇంక్రిమెంట్లు నిలిపివేసినట్టు తెలుస్తోంది. అదే విధంగా, సీనియర్ లెవెల్ నియామకాలు కూడా నిలిపివేసినట్టు సమాచారం. 35 రోజులకుపైగా బెంచ్‌లో ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. టీసీఎస్ ఈ మార్పులను వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా, AI వాడకంతో తక్కువ స్టాఫ్‌తో అధిక పనితీరు సాధించేందుకు చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ చర్యల ద్వారా సంస్థకు రూ.2,400 కోట్ల నుంచి రూ.3,600 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi