R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఊ అంటావా పాట కాపీ వివాదం.. టర్కీ సింగర్ వీడియో వైరల్

ఊ అంటావా పాట కాపీ వివాదం.. టర్కీ సింగర్ వీడియో వైరల్

ఊ అంటావా పాట కాపీ వివాదం.. టర్కీ సింగర్ వీడియో వైరల్

పుష్ప సినిమా ఫేమస్ సాంగ్ "ఊ అంటావా" మరోసారి వార్తల్లోకెక్కింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పాటను ఓ విదేశీయుడు నకలుచేశాడు. దీన్ని స్వయంగా దేవి శ్రీ ప్రకటించడంతో ఈ విషయమంతా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజు ఈవెంట్‌లో మాట్లాడిన దేవి శ్రీ.. "ఊ అంటావా" పాటను చెన్నైలో ఐదు నిమిషాల్లో కంపోజ్ చేశానని, ఇప్పుడు అది విదేశాల్లో కాపీ అయ్యిందని పేర్కొన్నారు. ఈ పాటను టర్కీ సింగర్ అతియే "అన్లయినా" అనే టర్కిష్ పాటగా మార్చి విడుదల చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. దీంతో వీడియో వైరల్ అవుతూ, "కాపీ కొడితే కనీసం క్రెడిట్ ఇవ్వాలి కదా!" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటపై గతంలో కూడా వివాదం వెలుగులోకి వచ్చింది. తమిళ హీరో సూర్య నటించిన "వీడోక్కడే" చిత్రంలోని "హానీ హానీ" పాటను "ఊ అంటావా"కి ఆధారంగా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై చిత్ర బృందం స్పందించలేదు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi