K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అనురాగ్ కశ్యప్ ‘నిశాంఛి’ మొదట సుశాంత్ కోసం రాసుకున్న కథ
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అనురాగ్ కశ్యప్ ‘నిశాంఛి’ మొదట సుశాంత్ కోసం రాసుకున్న కథ

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన కొత్త సినిమా ‘నిశాంఛి’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రాన్ని మొదట దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం రాసుకున్నానని ఆయన తెలిపారు. అయితే సుశాంత్ ఇతర ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో ఈ కథ అప్పుడు నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆయిశ్వర్య్ థాకరే హీరోగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘నిశాంఛి’ సెప్టెంబర్ 19, 2025న విడుదల కానుంది. అమెజాన్ MGM స్టూడియోస్ సమర్పణలో, జార్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో వేదికా పింటో, మోనికా పన్వార్, మహమ్మద్ జీషాన్ అయ్యూబ్, కుముద్ మిశ్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi