K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

20 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత కొత్త లుక్‌లో అనుష్క “ఘాటి”

20 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత కొత్త లుక్‌లో అనుష్క “ఘాటి”

20 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత  కొత్త లుక్‌లో అనుష్క “ఘాటి”

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన యాక్షన్ డ్రామా “ఘాటి” సెప్టెంబర్ 5న విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించగా, విక్రమ్ ప్రభు హీరోగా నటించారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ – “ఘాటిలో నేను చేసిన శీలావతి పాత్ర చాలా ప్రత్యేకమైనది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. క్రిష్ గారి దర్శకత్వంలో మళ్లీ పనిచేయడం నాకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది” అని తెలిపారు. తన కెరీర్‌ 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన అనుష్క, భవిష్యత్తులో నెగటివ్ రోల్ చేయాలన్న కోరిక ఉందని, ప్రస్తుతం మలయాళ సినిమాలో నటిస్తున్నానని, త్వరలోనే కొత్త తెలుగు సినిమా ప్రారంభమవుతుందని వెల్లడించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi