R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఏపీ జీఎస్టీ వసూళ్లలో దేశానికి ఆదర్శంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

ఏపీ జీఎస్టీ వసూళ్లలో దేశానికి ఆదర్శంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

ఏపీ జీఎస్టీ వసూళ్లలో దేశానికి ఆదర్శంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

అమరావతి: జీఎస్టీ వసూళ్లలో దేశానికి ఆదర్శంగా నిలవాలన్న దిశగా ఆంధ్రప్రదేశ్‌ పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన కేంద్ర-రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పన్ను ఎగవేతలు నివారించేందుకు డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతను ఉపయోగించాలన్నారు. జీఎస్టీ వసూళ్ల ప్రక్రియ సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకుని, ఆదాయాన్ని ప్రజల సంక్షేమానికి వినియోగించాలని తెలిపారు. పన్నుల ఎగవేతను గుర్తించేందుకు విద్యుత్ వినియోగం వంటి డేటాను పరిశీలించాలని సూచించారు. రాబోయే రోజుల్లో విశాఖ, విజయవాడల్లో జీఎస్టీ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు ద్వారా వివాదాల పరిష్కారం వీలవుతుందని అధికారులు వివరించారు. అమరావతిలో జీఎస్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిని కేటాయించాల్సిందిగా కేంద్ర అధికారులు సీఎంకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi