ritesh
రచయిత
ఏపీ మద్యం కుంభకోణం: జగన్ సన్నిహితుల ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము!
ritesh
రచయిత
ఏపీ మద్యం కుంభకోణం: జగన్ సన్నిహితుల ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము!

మద్యం కుంభకోణంలో లభించిన ముడుపుల సొమ్ము మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ ఖాతాల్లోకి చేరినట్లు సిట్ అనుబంధ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.తాజాగా ఏసీబీ కోర్టులో దాఖలైన అభియోగపత్రంలో... వీరు ముడుపుల సొమ్ముతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. కృష్ణమోహన్‌రెడ్డి అధికార పార్టీ ఖాతాకు సంతకం చేసే అధికారం కలిగిన వ్యక్తి. ముడుపులు వసూలు చేసే నెట్‌వర్క్‌లో అతని పాత్ర కీలకమని, సీడీఎమ్‌ల ద్వారా నగదు అతని ఖాతాలోకి జమ చేసినట్లు సమాచారం.2022 నుంచి 2024 మధ్య కాలంలో వాసుదేవరెడ్డి అనే అధికారి కృష్ణమోహన్ ఖాతాకు లక్షల రూపాయల నగదు బదిలీ చేసినట్లు రికార్డులు చూపుతున్నాయి. ఆ డబ్బుతో మహేశ్వరం, బాన్సువాడ, రామచంద్రాపురం ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.