K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఏపీ లిక్కర్ కుంభకోణం: ఇండోర్‌లో కీలక నిందితులు ఎస్‌ఐటీ చేతుల్లోకి | kranthinews
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఏపీ లిక్కర్ కుంభకోణం: ఇండోర్‌లో కీలక నిందితులు ఎస్‌ఐటీ చేతుల్లోకి | kranthinews

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎస్‌ఐటీ కీలక మలుపు తిప్పింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పీఏలు బాలాజీ, నవీన్‌లను ఇండోర్‌లో అదుపులోకి తీసుకుంది. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దులకు రూ.8.2 కోట్లు తరలించిన కేసులో వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఆ సొమ్మును అప్పట్లో ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. అరెస్ట్ భయంతో వీరు ఇండోర్‌కు పారిపోయినప్పటికీ అక్కడి నుంచే వైసీపీ నేతలతో ఫోన్లు మాట్లాడుతూ ఉండటంతో, వారి ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఎస్‌ఐటీ బృందాలు వారిని పట్టుకున్నారు. గతంలో బాలాజీ అదుపులో ఉన్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు కోర్టులో హెబియస్ కార్పస్ వేసినా, ఎస్‌ఐటీ అప్పట్లో అది ఖండించింది. చివరికి ఎస్‌ఐటీ వీరిద్దరిని పట్టుకోవడంలో విజయం సాధించింది.
ట్యాగ్‌లు
Kranthi NewsAndhrapradeshpoliticskrtv newskrtv kranthitrending newscrime news