ashok
రచయిత
AP వర్షాలు: బంగాళాఖాతంలో అల్పపీడనాలు – వర్షాల జోరు నెలలాగే!
ashok
రచయిత
AP వర్షాలు: బంగాళాఖాతంలో అల్పపీడనాలు – వర్షాల జోరు నెలలాగే!

ఆగస్ట్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వేడికాలం నుంచి ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారుతుండటంతో వర్షాల ప్రభావం పెరుగుతుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 13వ తేదీ వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత మరో అల్పపీడనం ఏర్పడి తుపానుగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో గత రెండు నెలలుగా వర్షాభావం నెలకొని ఉన్నప్పటికీ, ప్రస్తుతం వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం చివరినుంచి, తదుపరి రెండు వారాల పాటు వర్షాల మోత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, తిరుపతి వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే వింజమూరు (నెల్లూరు జిల్లా)లో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.