Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా బాధ్యతల స్వీకరణ

అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా బాధ్యతల స్వీకరణ

అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా బాధ్యతల స్వీకరణ

ప్రముఖ రాజకీయ నాయకుడు అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా శనివారం అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. గోవా రాజభవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, గోవా ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్య, రాజకీయ, పరిపాలనా రంగాల్లో అశోక్ గజపతి రాజుకు విశేష అనుభవం ఉంది. గతంలో కేంద్ర మంత్రి పదవి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనను గవర్నర్‌గా నియమించడంపై పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi