Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తెదేపా అధ్యక్ష పదవులకు రాజీనామా చేసిన అశోక్ గజపతి రాజు
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తెదేపా అధ్యక్ష పదవులకు రాజీనామా చేసిన అశోక్ గజపతి రాజు

గోవా గవర్నర్‌గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు తెదేపాకు రాజీనామా చేశారు. శాశ్వత సభ్యత్వం, పొలిట్ బ్యూరో పదవుల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి లేఖలు పంపారు. కుటుంబంతో కలిసి సింహాచలం అప్పన్నస్వామిని దర్శించిన అనంతరం ఆలయంలోనే రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అప్పన్నస్వామిని దర్శించుకున్నదే గుర్తొచ్చిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు స్వామి ఆశీస్సులు తీసుకున్నట్టు తెలిపారు. పసుపు రంగు పవిత్రతను నిలబెట్టేలా పనిచేస్తానన్నారు. తన రాజీనామాపై ఇప్పటికే చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడి ఆమోదం పొందినట్టు తెలిపారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi