L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఆస్ట్రేలియా మహిళా జట్టు వరల్డ్ కప్‌కు రెడీ!

ఆస్ట్రేలియా మహిళా జట్టు వరల్డ్ కప్‌కు రెడీ!

ఆస్ట్రేలియా మహిళా జట్టు  వరల్డ్ కప్‌కు రెడీ!

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఏడో వరల్డ్ కప్ గెలుపు లక్ష్యంగా బలమైన జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా అలీసా హీలీ నాయకత్వం వహించనుండగా, తహ్లియా మెక్‌గ్రాత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. గాయం నుంచి కోలుకున్న సోఫీ మొలినెక్స్‌తో పాటు డార్సీ బ్రౌన్, జార్జియా వరేహమ్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు. అలీసా హీలీ, బెత్ మూనీ, ఫోబే లిచ్‌ఫీల్డ్ బ్యాటింగ్ విభాగాన్ని నడిపిస్తే, ఎలీసా పెర్రీ, అషే గార్డ్‌నర్, మెక్‌గ్రాత్ ఆల్‌రౌండర్లుగా బలం చేకూర్చనున్నారు. మేగన్ షట్ ఆధ్వర్యంలోని పేస్ దళం కూడా జట్టుకు అదనపు శక్తిని ఇస్తుంది. ప్రపంచ కప్‌కు ముందు భారత్‌తో వన్డే సిరీస్ ఆడనుండగా, అదనంగా చార్లీ నాట్, నికొలే ఫాల్టమ్‌లను కూడా ఎంపిక చేశారు. అక్టోబర్ 1న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi