yakub
రచయిత
పాకిస్థాన్ సైన్యంపై బలోచ్ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రతరం
yakub
రచయిత
పాకిస్థాన్ సైన్యంపై బలోచ్ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రతరం

బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాక్ సైన్యంపై దాడులతో తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. గత రెండు రోజుల్లో జరిగిన విరుచుకుపడిన దాడుల్లో మొత్తం 27 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారని BLA ప్రకటించింది. ఫతే స్క్వాడ్ అనే విభాగం కలాత్‌లోని నిమ్రాగ్ క్రాస్ వద్ద సైనిక బస్సును లక్ష్యంగా చేసుకొని పేలుడు జరిపింది. ఈ బస్సు కరాచీ నుంచి క్వెట్టాకు దళాలను తరలించేందుకు ఉపయోగించబడుతున్న సందర్భంలో ఈ దాడి జరిగింది. ఇక క్వెట్టా హజార్‌గంజ్‌లో ఐఈడీ పేలుడు ద్వారా మరో ఇద్దరు సైనికులు మరణించారని, ఖజినా ప్రాంతంలో మరొక దాడిలో నలుగురు, గుజ్రోకొర్‌లో జరిగిన దాడిలో మరో ఆరుగురు సైనికులు చనిపోయారని BLA పేర్కొంది. ఈ దాడుల్లో మేజర్ సయిద్ రబ్ నవాజ్ తరీక్ సహా పలువురు ఉన్నట్లు వెల్లడించింది. ఇక జనవరి నుంచి జూన్ వరకు బలోచ్ రెబల్స్ మొత్తం 286 దాడులు జరిపినట్లు సమాచారం. వీటిలో 3 ఆత్మాహుతి దాడులు, 700 మందికి పైగా ప్రాణనష్టం, 290 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. అంతేకాదు, ఓ రైలు హైజాక్ చేయడంతో పాటు, 133 వాహనాలపై దాడులు, 45 ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు BLA గణాంకాలు చెబుతున్నాయి. ఈ దాడులతో పాక్ సైన్యంలో తీవ్ర ఆందోళన నెలకొంది.