R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమంపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమంపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమంపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణలో ఇటీవల ప్రారంభమైన ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమంపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఇది హిందూ సమాజాన్ని చీల్చే కుట్రగా పేర్కొంటూ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కమ్యూనిస్టుల ముసుగులో దానిని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.హైదరాబాద్ యూసుఫ్‌గూడలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీలో మాట్లాడిన సంజయ్, మార్వాడీలు వ్యాపారాల ద్వారా జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి వ్యాపారాలు హిందూ సనాతన సంస్కృతికి మద్దతుగా ఉన్నాయని అన్నారు. అలాంటి వారిని రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని కోరడమేంటని ప్రశ్నించారు.ఒక వర్గం మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను నియంత్రిస్తున్నారని, బీజేపీపై "మార్వాడీ గో బ్యాక్" ఉద్యమాలు జరిగితే, తాము కూడా రోహింగ్యాలు గో బ్యాక్ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పాతబస్తీలో రోహింగ్యాలపై ఐఎస్ఐ లింకులున్నాయని కేంద్ర నివేదికలున్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మౌనం వహించడం దారుణమన్నారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi