L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భారత్‌తో ఐదో టెస్టుకు బెన్ స్టోక్స్ దూరం – ఇంగ్లాండ్ జట్టులో కీలక మార్పులు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భారత్‌తో ఐదో టెస్టుకు బెన్ స్టోక్స్ దూరం – ఇంగ్లాండ్ జట్టులో కీలక మార్పులు

భారత్‌తో జులై 31 నుంచి లండన్‌లో జరగనున్న ఐదో టెస్టు కోసం ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. అయితే, కుడి భుజం గాయంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండడని, ఓలీ పోప్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. స్టోక్స్ దూరమవడం ఆతిథ్య జట్టుకు గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటివరకు టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్టోక్స్, బాటింగ్‌లోనూ రాణించాడు. ఇంగ్లాండ్ తుది జట్టులో నాలుగు మార్పులు చేశారు. లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్‌కు బదులుగా జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జేమీ ఒవర్టన్, జోష్ టంగ్‌లను చేర్చారు. ఇంగ్లాండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఒవర్టన్, జోష్ టంగ్.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi