yakub
రచయిత
బిల్ గేట్స్ విలాస నౌక 'బ్రేక్ త్రూ' విక్రయానికి సిద్ధం
yakub
రచయిత
బిల్ గేట్స్ విలాస నౌక 'బ్రేక్ త్రూ' విక్రయానికి సిద్ధం

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన నౌక ‘బ్రేక్ త్రూ’ను త్వరలోనే విక్రయించనున్నారు. ఈ నౌకను సెప్టెంబర్ 24 నుండి 27 వరకు మొనాకోలో జరగనున్న యాట్ షోలో ప్రదర్శించి అమ్మే అవకాశముంది. లిక్విడ్ హైడ్రోజన్ ద్వారా నడిచే ఈ నౌక సుమారు 390 అడుగుల పొడవు కలిగి ఉండగా, ఇందులో ఏడు డెక్‌లు, బాస్కెట్‌బాల్ కోర్టు, సినిమా థియేటర్, హాట్ టబ్‌లు, ప్రైవేట్ ఆసుపత్రి, లగ్జరీ బాల్కనీలు, కార్యాలయాలు, లైబ్రరీలు, అతిథుల కోసం ప్రత్యేక క్యాబిన్లు వంటి విస్తృత సదుపాయాలు ఉన్నాయి. ఈ యాట్‌ను నిర్మించేందుకు నెదర్లాండ్స్‌కు చెందిన ఫెడ్‌షిప్ సంస్థ ఐదేళ్ల పాటు కృషి చేసింది. దీని ఖరీదు దాదాపు 645 మిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉంది. ఆసక్తికరంగా, ఈ నౌకను కొనుగోలు చేసినప్పటికీ బిల్ గేట్స్ ఇప్పటి వరకు అందులో అడుగుపెట్టలేదని సమాచారం.