A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నకిలీ డాక్టర్ల కలకలం.. వరంగల్‌లో బోగస్ క్లినిక్ గుర్తింపు!
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నకిలీ డాక్టర్ల కలకలం.. వరంగల్‌లో బోగస్ క్లినిక్ గుర్తింపు!

తెలంగాణలో నకిలీ డాక్టర్ల బెడద కొనసాగుతోంది. తాజాగా వరంగల్ జిల్లా మడికొండలో 'సాయిశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్' పేరిట నకిలీ ఆసుపత్రి నడుస్తున్నట్టు గుర్తించారు. వైద్య అర్హతలు లేని ఈ. జయరాం, ఈ. భాగ్యలక్ష్మి అనే దంపతులు, కేవలం ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుతోనే క్లినిక్ నడుపుతూ, యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ లాంటి మందులు ఇస్తున్నారని టీజీఎంసీ బృందం గుర్తించింది. టీఎంసీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించగా, వైద్యంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించి ఆధారాలు సేకరించారు. త్వరలోనే వారి మీద కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ వైద్యుల కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం నిఘా చర్యలు ముమ్మరం చేసింది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanawarangal