ashok
రచయిత
స్టాక్ మార్కెట్‌కు బ్రేక్.. వరుస నష్టాల తరువాత పుంజుకున్న సూచీలు
ashok
రచయిత
స్టాక్ మార్కెట్‌కు బ్రేక్.. వరుస నష్టాల తరువాత పుంజుకున్న సూచీలు

ముంబయి: వరుసగా రెండు రోజుల నష్టాల తరువాత భారత స్టాక్ మార్కెట్ పుంజుకుంది. ట్రంప్ సుంకాల బెదిరింపులను పెద్దగా పట్టించుకోకుండా, మార్కెట్ చివర్లో కొనుగోళ్ల మద్దతుతో మళ్లీ స్థిరత్వాన్ని సాధించింది. ప్రారంభంలో అమెరికా–భారత్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతల ప్రభావంతో సూచీలు నష్టాల్లో ప్రారంభమైనా, ఐటీ, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు లాభాలకు దారితీశాయి. ట్రంప్ విధించిన 25% సుంకంపై మార్కెట్ ఇప్పటికే స్పందించిందని, ఇక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశంపై మదుపర్లు ఆశాభావంతో ఉన్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంట్రాడే కనిష్ఠం 79,811 పాయింట్ల నుంచి సెన్సెక్స్ 800 పాయింట్ల వరకు లాభపడి, చివరికి 80,623 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 24,596 వద్ద లాభంతో స్థిరపడింది. రూపాయి విలువ డాలరుతో 87.69గా ఉండగా, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 67.30 డాలర్లు, బంగారం ఔన్సుకు 3451 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ఉండగా, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ నష్టపోయాయి.