A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇందిరమ్మ క్యాంటీన్లలో ఆగస్టు 15 నుంచి అల్పాహారం ప్రారంభం
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇందిరమ్మ క్యాంటీన్లలో ఆగస్టు 15 నుంచి అల్పాహారం ప్రారంభం

ఆగస్టు 15వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని ఇందిరమ్మ క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం అందుబాటులోకి రానుంది. జీహెచ్‌ఎంసీ రూ.5కే టిఫిన్ అందించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేసింది. ప్రతిరోజూ మిల్లెట్ ఆధారిత ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరి వంటి ఆహార పదార్థాలు వడ్డించనున్నారు. ఒక్కో టిఫిన్‌కి సుమారు రూ.19 ఖర్చవగా, లబ్ధిదారులు కేవలం రూ.5 మాత్రమే చెల్లించాలి. మిగతా వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ హరే కృష్ణ ఫౌండేషన్‌కి చెల్లిస్తుంది. ప్రస్తుతం నగరంలో 128 క్యాంటీన్లు పనిచేస్తుండగా, కొత్త డిజైన్‌లో మింట్ కాంపౌండ్‌లో మొట్టమొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతివారం ఆరు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana