A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బీఆర్‌ఎస్ నేతల సంచలన ఆరోపణలు – సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర కోవర్టు?
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బీఆర్‌ఎస్ నేతల సంచలన ఆరోపణలు – సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర కోవర్టు?

వరంగల్: సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారంటూ బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ భాస్కర్ ఆరోపించారు. హనుమకొండలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌తో కలిసి మాట్లాడారు.వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దారి తప్పించడానికే ఈ రకమైన పాలన సాగుతోందని ఆరోపించారు.పెద్ది సుదర్శన్‌రెడ్డి కూడా రేవంత్ రెడ్డి రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో స్పష్టమైన సమాచారం ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi