yakub
రచయిత
బీఆర్‌ఎస్ నేతలు నా దారిలోకి రావాల్సిందే: ఎమ్మెల్సీ కవిత
yakub
రచయిత
బీఆర్‌ఎస్ నేతలు నా దారిలోకి రావాల్సిందే: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్లపై తన పాత్రను స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని న్యాయ నిపుణులతో చర్చించిన తరువాతనే సమర్థించానని తెలిపారు. బీసీలకు రెండు బిల్లులు తీసుకురావాలంటూ మొదట తనే డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకులు స్పందించకపోవడంపై స్పందిస్తూ – "అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా" అని వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో జరిగిన సమావేశాన్ని పండగలా చిత్రీకరించడం సరికాదని, ఆ ప్రాజెక్టు ద్వారా ఏపీకి కూడా ప్రయోజనం లేకుండా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్న కుట్రగా అభివర్ణించారు. బీసీ రిజర్వేషన్లు, బనకచర్ల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు తక్షణమే నిలిపివేయకపోతే జాగృతి న్యాయపోరాటం చేయాల్సి వస్తుందన్నారు.