L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

విమానంలో బాంబు బెదిరింపుతో కలకలం – స్కాట్లాండ్‌లో ఘటన

విమానంలో బాంబు బెదిరింపుతో కలకలం – స్కాట్లాండ్‌లో ఘటన

విమానంలో బాంబు బెదిరింపుతో కలకలం – స్కాట్లాండ్‌లో ఘటన

యూకేలో స్కాట్లాండ్‌ విమానంలో ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ కేకలు వేయడంతో ఆందోళన నెలకొంది. లుటన్‌ నుంచి గ్లాస్గోకు వెళ్లే ఈజీజెట్‌ విమానంలో జరిగిన ఈ ఘటనలో, టేకాఫ్ అయిన కొంతసేపటికే ప్రయాణికుడు తన సీటు నుంచి లేచి బాంబు ఉందని, విమానం పేలుస్తానంటూ అరవడం ప్రారంభించాడు. అతడి వ్యాఖ్యలతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన ఏర్పడింది. వెంటనే సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, విమానాన్ని సమీప ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఆ తరువాత అతడిని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతానికి అతడి వివరాలు వెల్లడి కాలేదు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్కాట్లాండ్‌లో పర్యటిస్తున్న వేళ ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi