Lahari
రచయిత
కాలిఫోర్నియాలో కార్చిచ్చు కలకలం: 65 వేల ఎకరాల్లో మంటలు
Lahari
రచయిత
కాలిఫోర్నియాలో కార్చిచ్చు కలకలం: 65 వేల ఎకరాల్లో మంటలు

అమెరికా సెంట్రల్ కాలిఫోర్నియాలో విస్తరించిన కార్చిచ్చు స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. 'గిఫోర్డ్ ఫైర్'గా పేరుగాంచిన ఈ మంటలు ఇప్పటికే 65 వేల ఎకరాలకు పైగా విస్తరించాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ భారీగా పొగ వ్యాప్తి చెందుతోంది. లాస్ ఏంజెలెస్, వెంచురా, కార్న్ కౌంటీలతో పాటు లాస్ వెగాస్ వరకు ప్రభావం చూపుతుంది. గాలినాణ్యత క్షీణించడంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు సూచనలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తాత్కాలికంగా తరలిస్తున్నారు. ప్రస్తుతం మంటలు మూడు శాతమే అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు ఆపత్కరంగా ఉండటంతో మంటలను అదుపు చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. రహదారులు మూసేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసరంగా వైద్యం అందిస్తున్నారు. వాతావరణ శాఖ ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.