ashok
రచయిత
మద్యం కుంభకోణంలో బఘేల్ కుమారుడు చైతన్య అరెస్ట్ – రాజకీయ కలకలం!
ashok
రచయిత
మద్యం కుంభకోణంలో బఘేల్ కుమారుడు చైతన్య అరెస్ట్ – రాజకీయ కలకలం!

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.2,160 కోట్ల మద్యం కుంభకోణంలో మాజీ సీఎం భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. 2019–2022 మధ్య జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి కొత్త ఆధారాలపై శుక్రవారం బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించి చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. చైతన్య పుట్టినరోజు రోజునే అరెస్టు జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన భూపేశ్ బఘేల్, "ఇది నా కొడుకు పుట్టినరోజు కానుకగా మోదీ, అమిత్ షాల బహుమతి" అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈడీ దాడులు రాజకీయ కక్షసాధింపు భాగమని, తమను ఇలాంటి బెదిరింపులతో నిలిపేయలేరని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చైతన్య అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని నియంత్రించారు. మొత్తం వ్యవహారాన్ని రాజకీయ వేధింపుల్లా చూడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.