Lahari
రచయిత
విమానాన్ని మించేసిన చైనా రైలు!
Lahari
రచయిత
విమానాన్ని మించేసిన చైనా రైలు!

చైనా తాజాగా అభివృద్ధి చేసిన కొత్త రైలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చక్రాలు లేని ఈ మ్యాగ్‌లెవ్ రైలు గంటకు 600 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. ఇది విమానాల కంటే వేగంగా ప్రయాణించగలదు. ఇప్పటికే దీని ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ రైలు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతపై పనిచేస్తుంది. దీంతో, ట్రాక్‌ను తాకకుండా గాలిలో తేలుతూ సాఫీగా ప్రయాణిస్తుంది. భౌతిక ఘర్షణ లేకపోవడంతో శబ్దం తక్కువగా ఉంటుంది, వేగం అధికంగా ఉంటుంది. ఈ సూపర్ ఫాస్ట్ రైలు బీజింగ్-షాంఘై మధ్య ప్రస్తుతం 5.5 గంటల ప్రయాణాన్ని కేవలం 2.5 గంటల్లో పూర్తిచేస్తుంది. ప్రత్యేకమైన ఏరోడైనమిక్ డిజైన్, అంతర్గతంగా డిజిటల్ స్క్రీన్లు, విశాలమైన క్యాబిన్లతో ఈ రైలు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. భవిష్యత్తులో రవాణా రంగాన్ని మార్చేసే విధంగా ఇది రూపొందించబడింది.