yakub
రచయిత
రిజిస్టర్డ్ పోస్ట్ ఆపుతున్నారన్న వార్తలపై కేంద్రం క్లారిటీ
yakub
రచయిత
రిజిస్టర్డ్ పోస్ట్ ఆపుతున్నారన్న వార్తలపై కేంద్రం క్లారిటీ

రిజిస్టర్డ్ పోస్ట్‌ను తపాలా శాఖ నిలిపివేస్తోందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్టర్డ్ పోస్ట్‌ను 2025 సెప్టెంబర్ 1న నిలిపివేస్తారన్న ప్రచారం పూర్తిగా నిరాధారమని కేంద్ర సమాచార శాఖ పరిధిలోని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేయడం జరగదని, బదులుగా ఇవి స్పీడ్ పోస్ట్‌లో విలీనమవుతున్నాయని వివరించింది. రిజిస్టర్డ్ పోస్ట్‌ల మాదిరిగానే డెలివరీ రసీదు, రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వినియోగదారులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో స్పీడ్ పోస్ట్ పరిధిలోకి రిజిస్టర్డ్ పోస్ట్‌ను తీసుకురావడం జరిగిందని స్పష్టం చేసింది. ఈ విధానం 2025 సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ఇప్పటికే అన్ని మెయిల్ ఆపరేషన్ డివిజన్లకు తగిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం.