ritesh
రచయిత
క్లౌడ్ బరస్ట్ బీభత్సం – జమ్మూ కాశ్మీర్‌లో 60 మంది మృతి, సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి
ritesh
రచయిత
క్లౌడ్ బరస్ట్ బీభత్సం – జమ్మూ కాశ్మీర్‌లో 60 మంది మృతి, సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన క్లౌడ్ బరస్ట్ భారీ ప్రాణ నష్టానికి దారితీసింది. కిష్త్వార్‌లోని చోసిటీ ప్రాంతంలో వరదల కారణంగా మృతుల సంఖ్య 60కి చేరింది. శనివారం (ఆగస్టు 16) నాటికి మూడో రోజు కొనసాగుతున్న సహాయక చర్యల్లో ఇప్పటివరకు 21 మృతదేహాలను గుర్తించారు. వీరిలో ఇద్దరు CISF సిబ్బందితో పాటు, 300 మంది వరకు గాయపడ్డారు. ఇంకా 73 మంది గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.ఇక స్థానికులు ఈ ఘటనను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. "బాంబు పేలినట్టు ఒక్కసారిగా శబ్దం వినిపించింది. అరుపులు, పరుగులు…ఇండ్లు ఆడుకునే బొమ్మల్లా కొట్టుకుపోయాయి," అంటూ ఒక బాధితురాలు తెలిపింది. మరో బాధితుడు మాట్లాడుతూ, "నీటిలో ఇరుక్కున్నాను, ఒక పోలీసు సహాయం చేసి బయటికి తీశారు. కానీ నా సోదరి ఇప్పటికీ కనిపించదు" అని వాపోయాడు.