ashok
రచయిత
సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు: ఎమ్మెల్సీ కవిత
ashok
రచయిత
సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు: ఎమ్మెల్సీ కవిత

శంపేట మండలం కాకునూర్ గ్రామంలో గృహలక్ష్మి పథకాన్ని అమలులోకి తేవాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోస్ట్‌కార్డ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కన్నా ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారని విమర్శించారు. ఆడపిల్లలకు స్కూటీలు, పెళ్లికి తులం బంగారం, లక్ష రూపాయల సహాయం ఇస్తామన్న హామీలపై కవిత ప్రశ్నలు గుప్పించారు. ఇప్పటి వరకూ ఇవి ఎక్కడ అమలయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో కాంగ్రెస్ కార్యకర్తలే ఉంటున్నారని, ప్రభుత్వం పని చేయకుండా ప్రజలకు మోసం చేస్తోందని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అంబులెన్సులకు డీజిల్ పోసే పరిస్థితి కూడా లేదన్నారు. రేషన్ బియ్యంలో నాణ్యత లేకపోవడం, రెండు లక్షల కోట్ల అప్పు పెరిగిపోయిన అంశాలపై కూడా మండిపడ్డారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిచ్చారు.